User Rating: / 0
PoorBest 

మనం జీవిత లక్ష్యాలను సాధించగలమో లేదోననే ఆందోళన, ఆశానిరాశలు, ఆర్థిక ఇబ్బందులు మొదలైన అనేక సమస్యలతో హాయిగా ఊపిరి పీల్చుకోలేని దుస్థితిని మనందరం ఎదుర్కొంటున్నామనడంలో ఎలాంటి అనౌచిత్యం లేదు. దీనిని పెద్దవారికి సంబంధించిన సమస్యగా మాత్రమే పరిగణించడానికి వీల్లేదు. చిన్న పిల్లలు కూడా వారి వయస్సుకు మించిన పుస్తకాల బరువును వీపు మీద మోస్తున్నట్లే, అనేక సందర్బా లలో వారి తలకు మించిన భారాన్ని కూడా మోయాల్సి వస్తున్నది. ఫలితంగా పిల్లలు శారీరకంగానే కాక, మానసికంగా కూడా దెబ్బ తింటున్నారు. పోషకాహారలోపాలతోపాటు చదువులో పోటీతత్వం పెరగడంతో వారికి భోజనంపట్ల ధ్యాస ఉండటం లేదు.

తల్లిదండ్రులు తమనుంచి ఆశించే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని ఇబ్బందులు పడటమే కాకుండా, టీచర్లు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు

విధించే నిర్బంధ విద్య కూడా వారిని శారీరకంగానే కాక, మానసికంగా కూడా తీవ్రమైన వత్తిళ్లకు గురి చేస్తున్నది. తద్వారా వారు పలు రకాలైన వ్యాధుల బారిన పడుతున్నారు. అత్యధికంగా గాలి పీల్చుకోవడం ఆందోళనకు గురయిన సందర్బా లలో అత్యధిక స్థాయిలో గాలి పీల్చుకోవడం జరుగుతుంది. దీనిని వైద్యపరంగా యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌ అని వ్యవహరిస్తారు. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులలో మానసిక వత్తిడి పెరుగుతుంది. ఫలితంగా అత్యధిక స్థాయిలో గాలి పీల్చుకోవడం, వారి గుండెలు బరువెక్కినట్లు ఉండటం, గుండెదడ, నిద్ర సరిగ్గా పట్టకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఊపిరి ఎక్కువగా తీసుకోవడం వలన రక్తంలో ఉండే కార్బన్‌ డయాక్సైడ్‌ పరిమాణం తగ్గుతుంది. దీని వలన రెస్పిరేటరీ అల్కలోసిస్‌ అనే సమస్య ఉత్పన్నమవుతుంది. ఇటువంటి వారిలో కాళ్లు, చేతులు కొంకర్లు తిరిగి టెటనీ అనే వ్యాధి వచ్చే అవ కాశం ఉంది. వీరు తమ మానసిక వత్తిడిని తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నంలో ఎడతెరపి లేని దగ్గు, ఛాతిలో నొప్పి మొదలైన లక్షణాలను ఉన్నట్లు ప్రవర్తిస్తారు.

పిల్లలు మెళకువగా ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపించినా, నిద్రపోగానే ఆ లక్షణాలు మటుమాయమైపోతాయి. మహిళల విషయంలో బహిష్టుకు ముందు మూడు నాలుగు రోజులపాటు కొంతమందిలో యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌ లక్షణాలు కనిపిస్తాయి. పురుషులలో కంటే స్త్రీలలో యాంగ్జయిటీ హైపర్‌వెంటిలేషన్‌ వలన సోకే ఊపిరితిత్తుల వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య దెబ్బలాటలు, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసే తత్వం, ఇరుగుపొరుగు వారి మాటలను తట్టుకోలేని సున్నిత మనస్తత్వం ఉన్న వారు ఈ రకమైన వ్యాధికి గురవుతారు. కొంతమంది స్త్రీలలో అతి స్వల్ప విషయాలకు కూడా యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌కు గురయ్యే లక్షణం ఉంటుంది. ఉదాహరణకు భర్త ఏదైనా వాహనంపై వెళ్లినా, సమయానికి ఇంటికి రాకపోయినా, పిల్లలకు కొద్దిపాటి అనారోగ్యం కలిగినా వీరు ఆందోళనకు గురై, యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌కు లోనవుతారు.

ఏం చేయాలి?

పిల్లల్లో వచ్చే యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌ను తల్లిదండ్రులు తొలిదశలోనే గుర్తించి, పిల్లలకు ఆందోళన కలిగించే విషయాలపట్ల వారికి అవగాహన కలిపిస్తూ వారిలో భయాన్ని పారద్రోలాలి. కొన్ని సందర్బా లలో తల్లిదండ్రుల ప్రవర్తన ఇంట్లో వాతావరణాన్ని వేడెక్కించి, ఆందోళన కలిగించేలా తయారవుతుంది. ఇటువంటి సమయాల్లో అది పిల్లల దృష్టిలో పడకుండా చూడాలి. పిల్లలు బాగా చదివి మొదటి ర్యాంకు రావాలనీ, పక్కవారి పిల్లలకంటే చదువులో అధికంగా ఉండాలనీ వారిని వత్తిడి చేయకుండా, వారి స్థాయికి తగినట్లు ప్రోత్సహిస్తే వారే ప్రధములుగా ఉత్తీర్ణులు కావాలనే సంకల్పంతో చదవడం ప్రారంభిస్తారు. అదే విధంగా క్రీడలు, సంగీతం మొదలైన ప్రక్రియల్లో ప్రోత్సాహాన్నివ్వడం, మంచి పుస్తకాలు చదివే విధంగా ఉత్సాహపరచడం కూడా అవస రమే. స్త్రీలకు సంబంధించి, యాంగ్జయిటీ హైపర్‌ వెంటిలేషన్‌తో బాధపడేవారు తమ మనస్సును మరొక అంశంపైకి మరల్చుకోవాలి. ఏదో పని కల్పించుకుని చేయడం, యోగ, ధ్యానం, పుస్తక పఠనం, సంగీతం వినడం మొదలైనవి వారిలో కలిగే యాంగ్జయిటీ హపర్‌ వెంటిలేషన్‌ను నియంత్రిస్తాయి. ఇటువంటి వారు మానసిక వైద్య నిపుణుల సలహా తీసుకోవడం కూడా మంచిదే. ఇతర వ్యాధులు మానసిక వత్తిడి వలన వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లి అనేక కొత్త వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అంతకుముందే ఉన్న కొన్ని వ్యాధులు తగ్గకపోవడం, తీవ్రంగా మారడం కూడా జరుగుతుంది. వీటిలో ముఖ్యమైనది ఆస్తమా.

కనీసం ప్రతి మందిలో ఒకరికి ఈ వ్యాధి ఉన్నట్లు పలు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఈ వ్యాధికి గురైన వారు సరైన మందులు, క్రమపద్ధతిలో వైద్యుల సూచన మేరకు వాడితే వ్యాధి అదుపులో ఉంటుంది. కొద్ది మందిలో మాత్రం వ్యాధి ఎన్ని మందులు వాడినా పూర్తిగా తగ్గదు. ఇలాంటివారిలో వ్యాధి తగ్గకపోవడానికి మానసికవత్తిళ్లు, వ్యాధులు కారణంగా కనిపిస్తాయి. ఈ మానసిక వ్యాధులకు కూడా ఆస్తమా మందులతోపాటు చికిత్స తీసుకుంటేనే ఆస్తమాను పూర్తిగా నియంత్రించడం సాధ్యమవుతుంది. డిప్రెషన్‌, యాంగ్జయిటీ, స్కిజోఫ్రీనియా వంటి వ్యాధులు ఉన్నట్లయితే వీటికి సైకియాట్రిస్ట్‌ సలహా తీసుకుని ఆ మందులతోపాటు ఆస్తమా మందులు కూడా కలిపి వాడాల్సి ఉంటుంది. అప్పుడే వ్యాధి త్వరితంగా తగ్గడమే కాకుండా, ఆస్తమాకు అవసరమయ్యే మందుల సంఖ్య, మోతాదు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఈ విధంగా ఆయా మందుల దుష్ప్రభావాలను కూడా అరికట్టవచ్చు. ధూమపానం చేసే వారిలో బ్రాంకైటిస్‌, న్యుమోనియా, లంగ్‌ కేన్సర్‌ వంటి వ్యాధులు వస్తాయి. ఈ అలవాటు ఒక మానసిక వ్యాధికి సంబంధించినదే. పొగతాగడం వంటి అలవాటును పారద్రోలగలిగితే పొగ వలన కలిగే అనేక అనర్థాలను కూడా దూరం చేయవచ్చు. మానసిక వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులను కలిగించడం ఒక అంశమైతే, దీర్ఘకాలికంగా ఉండే ఆస్తమా, బ్రాంకైటిస్‌ల వలన మానసిక వ్యాధులు రావడం మరొక అంశం. వ్యాధి లక్షణాలతో సతమతమవుతున్న వారిలో జబ్బు తగ్గుతుందో లేదోననే భయం వారిని మానసికంగా దెబ్బ తీస్తుంది. పదిమంది ఎదుట తమ వ్యాధి గురించి చెప్పుకోవాలన్నా, వారి ఎదుట ఇన్‌హేాలర్‌ వంటి మందులను వాడాలన్నా నామోషీగా భావిస్తారు. వీటన్ని వలన మానసిక వత్తిడి పెరిగి ఈ వ్యాధులు తగ్గ పోవడానికి కారణమవుతుంది. మానసిక వ్యాధుల వలన వ్యాధి నిరోధక శక్తి తగ్గి క్షయ, న్యుమోనియా, జలుబు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details