నిత్యజీవనవిధానంలో నేటి ఆధునిక కాలంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఒత్తిళ్లకు ప్రత్యేకించి మందు లు అంటూ ఏమీ ఉండవు. అవికూడా ఏదో తాత్కాలిక ఉపశమనమే తప్ప వాటిని నియంత్రించుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ముదిమి వయసువారిదాకా ఏ ఒక్కరూ ఈ ఒత్తిడికి అతీతం కాదు. ఏ వయసులోవారికి తగినట్లు ఒత్తిడి ఉంటుంది. దీనికి తోడు మన ఆహారపు అలవాట్లను కూడా మనం పూర్తిగా మార్చేసుకున్నాం. ఆహారంలో పీచుపదార్ధాలు లేని పిజ్జాబర్గర్లను తినేస్తూ...టీ, కాఫీలు తాగేస్తూ...లేనిపోని ఒత్తిళ్లను మరింతగా పెంచుకుంటున్నాం. అయితే మానసిక ఒత్తిడిని నివారించేం దుకు శరీర మర్ధనా నికి మించినది మరొ కటి లేదని వైద్యశాస్త్ర నిపుణులు చెబుతు న్నారు.
అయితే ఇప్పుడు పెద్ద పెద్ద పట్టణాలలో మాలిష్ సెంటర్లు వెలుస్తున్నాయి. మాలిష్ పేరిట అనవసరంగా ఎక్కువ డబ్బులు వృథా చేసేకన్నా...ఇంట్లోనే మాలిష్ ఏర్పాటు చేసుకోవచ్చు. అదెలాగంటే 30 గ్రాముల వేరుశనగ నూనెలో 5 చుక్కల కైమోమైన్ ఆయిల్, 5 చుక్కల క్లెరీసెజ్ ఆయిల్, 15 చుక్కల శాండిల్ ఆయిల్, 5 చుక్కల మెజోరమ్ ఆయిల్‌ను మిశ్రమంగా చేసుకుని ఉంచుకోవాలి.గోరువెచ్చని నీళ్లతో కలిపి శరీరం వెనకభాగంలో, వీపుపైన, మెడ చుట్టూ, భుజాలకింద మసాజ్ చేయించుకుంటే ఎంతటి తీవ్రమైన ఒత్తిడి నుంచయినా మనం బయటపడొచ్చు.
వైద్యుని సంప్రదించాలి
ఒక వేళ చర్మవ్యాధులు ఉన్నట్లయితే వైద్యుని సంప్రదించి ఎటువంటి ఆయిల్ వాడితే వారి శరీరానికి పడుతుందో చూసుకుని వాడితే ఫలితం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చవకైన ఆయిల్‌ను ఉపయోగించి లేనిపోని ఆయింట్‌మెంట్స్, షాంపూలను శరీరానికి పట్టించి మాలిష్ చేస్తుంటారు. అటువంటి వాటితో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే చర్మ సంబంధ రోగాలు శరీరమంతా సోకే అవకాశం ఉంది.
ఇంట్లోనే మాలిష్...
కొత్త కొత్త ప్రదేశాలలో మాలిష్ చేయించుకునే ముందర ఆ మాలిష్ సెంటర్ గురించి ఎంక్వయిరీ చేయాలి. ఇప్పుడు మాలిష్ సెంటర్ల చాటున సంఘవిద్రోహ చర్యలు జరుగుతున్నాయి. అందుకే ఇటువంటివి ఏమీ లేకుండా...మన ఇంట్లోనే వీలైతే భాగస్వామి సహకారంతోగానీ, ఎదిగిన పిల్లలతోగానీ మనకు మనమే సొంతంగా మాలిష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
నిద్రలేమికి...
కొందరికి నిద్రలేమితో అవస్థలు పడుతుంటారు. అటువంటి వారు పడుకోబోయే ముందు తలకు, మెడకు గోరువెచ్చని నీటితో మాలిష్ చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. లేకపోతే మం దార నూనెగానీ, బృంగామర తైలంతోగానీ తలమర్థన చేసుకుంటే మంచిది.
చుండ్రు నివారణలో...
చుండ్రు అధికంగా ఉన్న వారు అప్పుడప్పుడు నిమ్మ కాయను రెండు చెక్కలుగా కోసి తలకు పట్టిస్తే చాలా మంచిది. చుండ్రు నివారణ కూడా అవుతుంది.
| ఒంటరిగా ఉండొద్దు< Prev | Next >మానసిక ఒత్తిడి వల్ల కలిగే వ్యాధులు |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details