మూడు విడ‌త‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల పోలింగ్ వివ‌రాలు ఇవే..!

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 21న మొదటి విడత పోలింగ్.. రెండో విడత పోలింగ్ జనవరి 25న.. మూడో విడత పోలింగ్ జనవరి 30న నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.  తొలి విడత ఎన్నికలు జనవరి 7న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు7 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ10న నామినేషన్ల పరిశీలన11న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం12న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం13న నామినేషన్ల ఉపసంహరణ21 పోలింగ్, ఓట్ల లెక్కింపు రెండో విడత ఎన్నికలు జనవరి 11న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు11 నుంచి 13 వరకు…

Read More

The Karmanghat Hanuman Temple is one of the oldest and popular Hindu temples in Hyderabad

The Karmanghat Hanuman Temple is one of the oldest and popular Hindu temples in Hyderabad

శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ఆలయం. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. రెండో ప్రతాపరుద్రునికి దర్శనం.. క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు…

Read More

న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు సమయాల్లో మార్పులు

న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు సమయాల్లో మార్పులు

హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రేపు(డిసెంబర్ 31)న నగరంలోని మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. మియాపూర్, ఎల్బీనగర్, నాగోలు నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయలు దేరనుంది. అమీర్ పేట నుంచి అర్ధరాత్రి 12.30 కు చివరి మెట్రో రైలు బయలుదేరనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు.

Read More

ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు మేడారం మినీ జాతర

ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు మేడారం మినీ జాతర

మేడారం మినీ జాతరకు పూజారులు సిద్ధంజయశంకర్ భూపాలపల్లి: తాడ్వాయి మండలంలోని ఆదివాసీ గిరిజన దైవాలు మేడారం సమ్మక్క-సారక్కల మినీ జాతర (మండె మెలిగె పండుగ) నిర్వహణకు అమ్మవార్ల పూజారులు సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు నాలుగు రోజుల పాటు తల్లుల ఉత్సవం నిర్వహించేందుకు తేదీలను ఖరారు చేశారు. అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, అమ్మవార్ల పూజారులు సమావేశం ఏర్పాటు చేసి జాతర వివరాలను వెల్లడించారు. 2019 ఫిబ్రవరి 20 నుంచి మాఘ శుద్ధ పౌర్ణమి వస్తుండటంతో పూజారులు అమ్మవార్ల మినీ జాతర ఏర్పాటుకు తేదీలను నిర్ణయించారు. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే అమ్మవార్ల మహాజాతర మాదిరిగానే…

Read More

హైకోర్టు విభజన.. న్యాయమూర్తులు బదిలీ

హైకోర్టు విభజన.. న్యాయమూర్తులు బదిలీ

హైదరాబాద్: హైకోర్టు విభజన నేపథ్యంలో హైకోర్టు భారీగా బదిలీలు, మార్పులు చేసింది. తెలంగాణ, ఏపీలో న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులను బదిలీ చేసింది. సుమారు 100 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏ రాష్ర్టానికి చెందిన న్యాయమూర్తులను ఆ రాష్ర్టానికే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తం న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తుల విభజన ప్రక్రియ పూర్తయింది.

Read More

చంద్రబాబు నల్లికుట్లోడు మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు

చంద్రబాబు నల్లికుట్లోడు మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకున్నాడు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. చంద్రబాబు నల్లికుట్లోడని, సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడుతారని చెప్పారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ కే వాసుదేవరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బాబుపై సీఎం కేసీఆర్ చేసిన విమర్శల్లో తప్పేముందని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బాబు స్పందించకుండా సొల్లు పురాణం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోరుకుంటున్నారని, ఆయనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హైటెక్ సిటీకి 1992 మే 21న అప్పటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన…

Read More

వైభవంగా మల్లన్న కల్యాణం

వైభవంగా మల్లన్న కల్యాణం

చేర్యాల: భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామివారి కల్యాణోత్సవం ఆదివారం ఆలయ తోటబావి ప్రాంతంలో అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి శాసనమండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు పట్టువస్ర్తాలు, ముత్యా ల తలంబ్రాలు సమర్పించారు. ఈ మహోత్సవానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి హాజరయ్యారు. దాదాపు 50 వేల మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 5 గంటలకు ఆలయవర్గాలు రెండు క్వింటాళ్ల బియ్యంతో అన్నంవండి రాశిగా పోసి దృష్టికుంభం కార్యక్రమాన్ని నిర్వహించాయి. స్వస్తిశ్రీ విళంబినామ సంవత్సరం మార్గశిర మాసం బహుళ నవమి ఆదివారం ఉదయం 10:45 గంటలకు కల్యాణోత్సవం కన్నులపండువగా సాగింది. …

Read More

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది

ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదేవిధంగా ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి హైకోర్టు నుంచి 14 మంది జడ్జిలను కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు, 10మంది జడ్జిలను తెలంగాణ హైకోర్టుకు కేటాయించనున్నారు. ఆ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు జనవరి 1 నుంచి విడివిడిగా పనిచేయనున్నాయి. ఏపీకి 37  తెలంగాణకు 24 ఉమ్మడి హైకోర్టుకు మంజూరు చేసిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. అందులో ఏపీకి 37, తెలంగాణకు 24 విభజించారు. ఏపీకి కేటాయించిన వారిలో 28 మంది శాశ్వతన్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు. తెలంగాణ…

Read More

తెలంగాణ టీడీపీకి దిక్కెవరు?

తెలంగాణ టీడీపీకి దిక్కెవరు?

తెలుగుదేశం తెలంగాణ శాఖ గురించి రాజకీయ వర్గాల్లోనే కాకుండా…పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం – అసంతృప్తి నెలకొందని చర్చ జరుగుతోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ బ్రహ్మండమైన విజయాన్ని సాధించి సర్కారు ఏర్పాటు చేసిన ప్పటికీ…ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇంకా టీడీపీ స్పందిచడం లేదని అంటున్నారు. రాజకీయ కారణాలు – తెలంగాణలో పరిస్థితులు – అంచనాలు విఫలమవడం వంటివి తాజా పరిస్థితులకు కారణమని అంటున్నారు. పార్టీ జాతీయ – రాష్ట్ర నాయకత్వంపై ఒకింత ఆగ్రహం వ్యక్తమవుతోంది.జాతీయ నాయకత్వం తమ అవసరాల కోసమే తెలంగాణ శాఖను బలిచేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే తెలంగాణ శాఖ నేతలు – కార్యకర్తల భవిష్యత్ ను…

Read More
1 2 3 4 18