Pains & Aches

కడుపు నొప్పికి కారణాలు అనేకం. ఎంత వెదికినా ఒక్కొక్కసారి కారణమే కనిపించదు. ఈ రోజుల్లో కూడా కడుపు ఒక మాజిక్‌ బాక్స్‌లాగా ప్రవర్తిస్తుంటుంది. అంటే ఆ బాక్స్‌ తెరిచే వరకూ (ఆపరేషన్‌ చేసే వరకూ) కారణం తెలియపోవచ్చు. కడుపు నొప్పి రావడానికిగల కారణాలేమిటి? అన్ని నొప్పులకు ఆపరేషన్‌ ఒక్కటే మార్గమా? ఏ వయస్సులో ఏ జబ్బుతో నొప్పి వస్తుంది? పురుషుల్లో, స్త్రీలలో వచ్చే నొప్పికి కారణాలేమిటి?

కడుపు నొప్పికి కారణమైన వాటిలో అనేక సందర్బా లలో '24 గంటల ఆపరేషన్‌' అని పేరు తెచ్చుకున్న అపెండిసైటిస్‌నుండి మందులతో, ఆహార నియమాలతో నయం చేయగలిగే అల్సర్‌ వరకూ అనేకం ఉన్నాయి. వీటిని వైద్య పరిభాషలో 'అక్యూట్‌ అబ్డామిన్‌' అని, 'క్రానిక్‌ అబ్డామిన్‌' అని విభజిస్తారు. అక్యూట్‌ అబ్డామిన్‌ సమస్య విపరీతమైన కడుపునొప్పితో ప్రారంభమవుతుంది. తగిన సమయంలో చికిత్స చేయకపోతే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. అక్యూట్‌ అబ్డామిన్‌కు ఉన్న అనేక కారణాల్లో ఇన్‌ఫెక్షన్లది ప్రధాన పాత్ర. అంటే కడుపులోని వివిధ అవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకితే ఏర్పడే స్థితి అక్యూట్‌ అబ్డామిన్‌. వీటిలో అక్యూట్‌ అపెండిసైటిస్‌, అక్యూట్‌ కోలిసిస్టయిటిస్‌, స్త్రీలలో సాధారణంగా కనిపించే సాల్పిన్‌జైటిస్‌, కాలేయానికి చీము పట్టడం ప్రధానమైనవి.

కడుపునొప్పికి సంబంధించిన మరి కొన్ని కారణాలలో ప్రేవులు మెలిక తిరిగిపోవడం లేదా వాటి మార్గంలో ఏదైనా అడ్డుపడటం ప్రధానమైనవి. దీనిని వైద్యపరిభాషలో ఇంటెస్టినల్‌ అబ్‌స్ట్రక్షన్‌ అంటారు. అదే విధంగా కడుపులో రక్తనాళాలు పగిలిపోవడం, గర్బి ణీ స్త్రీలలో పిండం గర్బ కోశంలో కాకుండా, ఇతర ప్రాంతాలలో పెరిగి, ఆ భాగం చిట్లి రక్తస్రావం కావడం (దీనిని రప్చర్డ్‌ ఎక్టోపిక్‌ గెస్టేషన్‌ అంటారు) మొదలైనవి కడుపునొప్పికి కారణమవుతున్నాయి. ఒక్కొక్కసారి కడుపులో కాకుండా, కడుపుపైన గోడలాగా ఉండే కండరాలకు ఇన్‌ఫెక్షన్‌ (అబ్డామినల్‌ వాల్‌ ఇన్‌ఫెక్షన్‌) వచ్చినా, ఛాతిలోని అవయవాలకు ఇన్‌ఫెక్షన్‌ సోకినా కడుపునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మరికొన్ని సార్లు వెన్నెముకకు వచ్చే జబ్బులు, మధుమేహం వలన కూడా కడుపునొప్పి వచ్చే అవకాశాలున్నాయి.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details