ప్రసవానంతరం... ప్రత్యేకంగా!
After Pregnancy Care అమ్మదనపు ఆనందం ఓ వైపు. అంతలోనే ఇంతటి లావు తగ్గుతామా.. పూర్వపు అందం సొంతం అవుతుందా అంటూ చాలామంది తల్లుల ఆందోళన. దాంతో ప్రసవం అయినప్పటి నుంచీ రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. అధికబరువు కొందరి సమస్య అయితే.. పొట్టపై చారలు.. చర్మ సంరక్షణ మరికొందరిని వేధిస్తుంది. వీటిని దూరం చేసేందుకు కొన్నిదేశాల్లో మహిళలు పాటించే చిట్కాలేమిటో చూద్దాం.
* ప్రసవం అయినప్పటినుంచీ.. అధిక బరువును దూరం చేసేందుకు జపనీయ యువతలు ఏం చేస్తారో తెలుసా.. భోజనం అయిన ప్రతిసారీ కప్పు గ్రీన్‌ టీ తాగుతారు. దాంతో కొన్నాళ్లకు శరీరం చెక్కిన శిల్పంలా తయారవుతుంది.

* పరగడుపునే ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ను కొద్దిగా తీసుకోవడం చాలామంది హాలీవుడ్‌ భామల అలవాటు. రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది. దాంతో కొన్నాళ్లకు సన్నబడటం ఖాయం. అలాగే చర్మం నిగారింపునూ సంతరించుకుంటుందనేది వీరి నమ్మకం.

* మన భారతీయుల ప్రకారం.. పొడిబారిన చర్మానికి.. పొట్టపై పడిన చారలు దూరం చేసేందుకు కొబ్బరినూనె మించిన ప్రత్యామ్నాయం లేదు. అయితే.. చారలు పూర్తి స్థాయిలో పోవు కానీ.. సమస్య కొంతవరకు అదుపులో ఉంటుంది.

* పాపాయిని చూసుకోవడం వల్ల కొన్నిసార్లు రాత్రిళ్లు నిద్రఉండదు తల్లులకు. దాంతో.. కళ్లు ఉబ్బి.. ఎర్రబడతాయి. దీన్ని దూరం చేసేందుకు.. జర్మన్‌ మహిళలు పాటించే చిట్కా ఏంటో తెలుసా.. కామొమైల్‌ టీ బ్యాగులను వేడినీటిలో ముంచి.. చల్లారాక కళ్లపై పెట్టుకోవడం. విశ్రాంతితో పాటు.. కళ్లు ప్రకాశవంతంగానూ మారతాయి.

* ప్రసవమయ్యాక.. సరైన సంరక్షణ లేక.. చర్మం అలిసిపోయినట్లు కనిపిస్తుంది. దీన్ని తగ్గించేందుకు స్వీడన్‌ వనితలు.. చాలా సులువైన చిట్కానే పాటిస్తారు. నిద్రలేచిన దగ్గర్నుంచి.. మళ్లీ నిద్రపోయే దాకా.. అప్పుడప్పుడు బాగా చల్లనినీటితో ముఖాన్ని కడుగుతుంటారు. అప్పుడే చర్మం తేటగా మారుతుందని అంటారీ మహిళలు.

* గ్రీస్‌కు చెందిన మహిళలయితే.. ఆలివ్‌నూనెను మించిన పరిష్కారం లేదంటూ సూచిస్తారు. రోజు స్నానానికి ముందు కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుంటే చాలు.. చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. దాంతోపాటు.. స్నానపు నీటిలో నాలుగైదు చుక్కల ఆలివ్‌నూనెనూ వేసుకుంటారు వీరు. ఇక కొద్దిగా ఆలివ్‌నూనె రాసుకుని.. ఆ తర్వాత పంచదారతో రుద్దుకుంటే.. ముడతలు దరిచేరవని వీరి నమ్మకం.

* హాయిగా నిద్రపోవడమే తమ సౌందర్యరహస్యం అని భావిస్తారు కొందరు విదేశీ తల్లులు. అందం కోసం బ్యూటీ స్లీప్‌ను మించిన రహస్యం లేదనేది వారి భావన.

తల్లీబిడ్డల...పోషకాహారం
బిడ్డల్ని కనబోయే తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని అందరికీ తెలుసు. దానికి పోషకాహారం అవసరమని కూడా తెలుసు. గర్భిణులు ఐరన్‌ మాత్రలు తీసుకునేది అందుకే. పెద్దయ్యాక రాబోయే స్థూలకాయం, డయాబెటిస్‌ వంటి జబ్బులకు కూడా తల్లి పొట్టలో ఉన్నప్పుడు అందని పోషకాహారమే కారణమని కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. తల్లిపాలల్లో ఉండే పోషకాలు మరే ఇతర ఆహారపదార్ధాలలో ఉండవన్నది నగ్నసత్యం...


మన భారతీయుల్లో స్థూలకాయం, షుగర్‌ చాలా ఎక్కువ. నలభైలు దాటీ దాటక ముందే అనేక మంది దీని బారిన పడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఇంత చిన్న వయసులో ఉన్న వారికి కూడా చక్కెర వ్యాధి వచ్చే ధోరణి మొదలైంది. ఇప్పటివరకూ స్థూలకాయం, చక్కెర వ్యాధులకు శారీరక వ్యాయామం లేకపోవడం, తిండి అలవాట్లు, ఒత్తిడి కారణమని వైద్యులు అభిప్రాయపడుతూ వస్తున్నారు. పుణెలోని కింగ్‌ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ హాస్పటల్‌ డయాబెటీస్‌ యూనిట్‌ డయాబెటీస్‌ పేషంట్ల సంఖ్య పెరగడానికి గల కారణాలను అన్వేషిస్తూ అధ్యయనాలు చేసినప్పుడు ఇప్పటి వరకూ చెబుతూ వస్తున్న కారణాల కంటే ముఖ్యమైనవి కూడా ఉన్నాయని గుర్తించింది. బ్రిటన్‌లో ఉన్న చక్కెర వ్యాధిగ్రస్థుడితో పోల్చి చూస్తే మన వాళ్ళలో చక్కెరవ్యాధి బారిన పడినవారు తక్కువ బరువుతోనే ఉన్నారు. కానీ శరీరంలో కొవ్వు శాతం ఎక్కువ ఉంది. కండపుష్ఠి లేకపోవడమే దీనికి కారణం.

మాతృత్వంలోనే వుంది. ఆడ జన్మసార్థకం......అయితే మాతృత్వం... అంటే.. స్ర్తీ గర్భం ధరించడం తర్వాత... నవమాసాలు మోసి బిడ్డను కనడం ఒక ఎతె్తైతే..... ఆ బిడ్డను కనీసం ఒక ఆరు నెలల వరకు చక్కగా పాలిచ్చి పెంచడం మరొక ఎత్తు.
ఆడదిగా నూరుమార్కులు తెచ్చుకోవాలంటే ఆమె పూర్తిగా ఒక బిడ్డకు తల్లికావడమేనంటారు. ఇంట్లో చంటిపిల్లలు పాకుతుంటే...ఆ ఇల్లాలికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఈ సృష్టిలోని ప్రతి జీవికీ ఈ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. ప్రత్యేకించి మానవజన్మలో ఈ బంధాన్ని మరింత పటిష్టవంతంగా చేశాడు. అందుకు ఆ బ్రహ్మ తనకుమారుగా ఓ అమ్మను సృష్టించాడు.

పుట్టిన బిడ్డను నాలుగు నెలల వరకు ఆరోగ్యకరం గా పెంచాలంటే,దానికి ఒక్కటే ఆధారం తల్లి పాలు.తల్లిపాలను మించిన పోషకం మరే ఇతర ఆహారపదార్థాలలో శిశువుకు దొరకదు. ఎందు కంటే శిశువు పుట్టిన 4 నెలల వరకు ఘన పదార్థాలు ఇవ్వడం కుదరదు. అలాంటపుడు కేవలం ద్రవపదార్థమే ఆ శిశువుకు ఆధారం. .....అన్ని పాళ్ళలో సరిగ్గా ఇవ్వల్సి వస్తే తప్పదు కానీ... తల్లి పాలను మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ విషయం మనం ఎన్నో సంవత్సరాలుగా చాల సందర్భాలలో గుర్తుచేసుకుంటున్న విషయమే....

తరంగిణి పొయ్యి (మైక్రోవేవ్‌ ఓవెన్‌) ఉపయోగించే గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓవెన్‌ పాతబడినా, జాగ్రత్తగా వాడకపోయినా ప్రమాదం ముంచుకొచ్చినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఈ ఓవెన్లపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై పూర్తిగా అధ్యయనం జరగనప్పటకీ.. గర్భిణులు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు. ఈ పొయ్యిలు ఎలక్ట్రోమాగ్నెటిక్‌ రేడియో ధార్మికతను వెలువరిస్తాయని.. ఇవి కడుపులో పిండానికి చెరుపు చేయటంతో పాటు గర్భస్రావానికీ దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. రేడియో ధార్మికత బయటకు వెలువడుతున్నట్టయితే తరంగిణి పొయ్యిలు హాని కలిగించినట్టే. మైక్రోవేవ్‌ ఓవెన్‌ తరంగాలు 12 సెం.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. కాబట్టి, దాని దగ్గరగా నిలబడితే గర్భిణులకు ప్రమాదం కలిగిస్తాయి. పొయ్యి తలుపు దెబ్బతిన్నా, దానిని తెరచి వంట చేస్తున్నా రేడియో ధార్మికత ఎక్కువగా బయటకు వస్తుంది. పాతబడిన పొయ్యిల్లో ఇది మరింత అధికం. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పాతబడిన వాటిల్లో సగానికిపైగా ఓవెన్లు.. ఎఫ్‌డీఏ నిర్ణయించిన ప్రమాణాల కన్నా 10% ఎక్కువగా రేడియో ధార్మికతను వెలువరిస్తున్నాయని అమెరికాలో జరిపిన ఒక సర్వేలో తేలటం గమనార్హం.

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details