User Rating: / 0
PoorBest 

మన ఇళ్లల్లో గర్భిణులను బాగా తినమని అందరూ పోరుతుంటారు. 'వట్టి మనిషివి కాదు, ఇద్దరి తిండి తినాలి' అంటూ అదేపనిగా తినిపిస్తుంటారు. ఇలాంటి ధోరణి ప్రమాదకరం అంటున్నారు పరిశోధకులు.

ఇలా ఎక్కువెక్కువగా క్యాలరీలను తీసుకోవటం వల్ల కాన్పు సమయంలో సమస్యలు తలెత్తుతాయనీ, గర్భవాతం (ప్రీఎక్లాంప్సియా) సమస్య తలెత్తి సిజేరియన్‌ తప్పనిసరయ్యే పరిస్థితులు తలెత్తుతాయని అంటున్నారు. అంతేకాదు.. తర్వాతి కాలంలో తల్లీబిడ్డా స్థూలకాయం బారినపడే ప్రమాదం ఉంటుంది. ఎత్తూబరువుల నిష్పత్తి మామూలుగా ఉండే మహిళలు గర్భం దాల్చినప్పుడు 15 కిలోల వరకూ బరువు పెరగవచ్చు. అయితే.. నిర్దేశించిన క్యాలరీలకన్నా రోజుకు 500 క్యాలరీల ఆహారం అదనంగా తీసుకుంటే గర్భిణులు మరింతగా బరువెక్కి, కాన్పులో సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంటుందని నార్త్‌ కరోలినా యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు.
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్ల వల్ల తల్లి ఎక్కువెక్కువ బరువు పెరిగే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. గర్భం దాల్చిన ప్రారంభ దశలో శాఖాహారం తీసుకునే గర్భిణుల్లో అదనంగా పెరిగే అనవసరపు బరువు సగానికి సగం తగ్గుతుంది. రోజూ అర్ధగంటపాటు శ్రమతో కూడిన వ్యాయామం చేసే వారిలో ముప్పు 20 శాతందాకా తగ్గుతుంది. ఆలివ్‌, వేరుసెనగ నూనెల్లో లభ్యమయ్యే మోనోశాచురేటెడ్‌ కొవ్వును తీసుకునే వారిలో అదనపు బరువు సమస్య తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. గర్భిణులు వేపుళ్లు, అధిక క్యాలరీలుండే చిరుతిళ్లు తినొద్దని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. వేపుళ్లు అనారోగ్యానికి దారితీస్తాయి. ఎక్కువెక్కువ బరువు పెరిగేందుకు ఇవే కారణం.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details