తరంగిణి పొయ్యి (మైక్రోవేవ్ ఓవెన్) ఉపయోగించే గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఓవెన్ పాతబడినా, జాగ్రత్తగా వాడకపోయినా ప్రమాదం ముంచుకొచ్చినట్టేనని హెచ్చరిస్తున్నారు. ఈ ఓవెన్లపై రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి. వీటిపై పూర్తిగా అధ్యయనం జరగనప్పటకీ.. గర్భిణులు దూరంగా ఉండటమే మేలని సూచిస్తున్నారు. ఈ పొయ్యిలు ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో ధార్మికతను వెలువరిస్తాయని.. ఇవి కడుపులో పిండానికి చెరుపు చేయటంతో పాటు గర్భస్రావానికీ దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. రేడియో ధార్మికత బయటకు వెలువడుతున్నట్టయితే తరంగిణి పొయ్యిలు హాని కలిగించినట్టే. మైక్రోవేవ్ ఓవెన్ తరంగాలు 12 సెం.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. కాబట్టి, దాని దగ్గరగా నిలబడితే గర్భిణులకు ప్రమాదం కలిగిస్తాయి. పొయ్యి తలుపు దెబ్బతిన్నా, దానిని తెరచి వంట చేస్తున్నా రేడియో ధార్మికత ఎక్కువగా బయటకు వస్తుంది. పాతబడిన పొయ్యిల్లో ఇది మరింత అధికం. రెండేళ్లు, అంతకన్నా ఎక్కువ కాలం పాతబడిన వాటిల్లో సగానికిపైగా ఓవెన్లు.. ఎఫ్‌డీఏ నిర్ణయించిన ప్రమాణాల కన్నా 10% ఎక్కువగా రేడియో ధార్మికతను వెలువరిస్తున్నాయని అమెరికాలో జరిపిన ఒక సర్వేలో తేలటం గమనార్హం.
ఈ పొయ్యిల నుంచి వెలువడే రేడియో ధార్మికతకు గురైతే.. కణాలు చనిపోవటం, వంధ్యత్వం, పోషకాహార లోపంతో పిల్లలు పుట్టటం, డీఎన్‌ఏ దెబ్బతినటం.. కొన్నిసార్లు గర్భస్రావాలు కూడా జరుగుతాయి. అయితే.. ప్రస్తుతానికి ఈ పొయ్యిలను గర్భిణులు వాడొద్దని మాత్రం చెప్పటం లేదు. వీటి నుంచి వెలువడే రేడియో ధార్మికత పైకి కనబడదు కూడా. కాబట్టి దీనిని గుర్తించటం చాలా కష్టం. అందుకే జాగ్రత్తగా ఉండటం అవసరమని చెబుతున్నారు.
| మాతృత్వంలోని ఉంది ఆడజన్మ సార్థకం< Prev | Next >గర్భిణి... ఇద్దరి తిండితో ఇబ్బందే! |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details