User Rating: / 0
PoorBest 

మాతృత్వంలోనే వుంది. ఆడ జన్మసార్థకం......అయితే మాతృత్వం... అంటే.. స్ర్తీ గర్భం ధరించడం తర్వాత... నవమాసాలు మోసి బిడ్డను కనడం ఒక ఎతె్తైతే..... ఆ బిడ్డను కనీసం ఒక ఆరు నెలల వరకు చక్కగా పాలిచ్చి పెంచడం మరొక ఎత్తు.
ఆడదిగా నూరుమార్కులు తెచ్చుకోవాలంటే ఆమె పూర్తిగా ఒక బిడ్డకు తల్లికావడమేనంటారు. ఇంట్లో చంటిపిల్లలు పాకుతుంటే...ఆ ఇల్లాలికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు. ఈ సృష్టిలోని ప్రతి జీవికీ ఈ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆ భగవంతుడు కల్పించాడు. ప్రత్యేకించి మానవజన్మలో ఈ బంధాన్ని మరింత పటిష్టవంతంగా చేశాడు. అందుకు ఆ బ్రహ్మ తనకుమారుగా ఓ అమ్మను సృష్టించాడు.

పుట్టిన బిడ్డను నాలుగు నెలల వరకు ఆరోగ్యకరం గా పెంచాలంటే,దానికి ఒక్కటే ఆధారం తల్లి పాలు.తల్లిపాలను మించిన పోషకం మరే ఇతర ఆహారపదార్థాలలో శిశువుకు దొరకదు. ఎందు కంటే శిశువు పుట్టిన 4 నెలల వరకు ఘన పదార్థాలు ఇవ్వడం కుదరదు. అలాంటపుడు కేవలం ద్రవపదార్థమే ఆ శిశువుకు ఆధారం. .....అన్ని పాళ్ళలో సరిగ్గా ఇవ్వల్సి వస్తే తప్పదు కానీ... తల్లి పాలను మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ విషయం మనం ఎన్నో సంవత్సరాలుగా చాల సందర్భాలలో గుర్తుచేసుకుంటున్న విషయమే....

అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా తల్లి పాలవారోత్సవం సందర్భంగా మరోసారి మరీ, మరీ గుర్తుంచుకోవాల్సిన విషయం .... పుట్టిన ప్రతి బిడ్డకూ తల్లి పాల ఆవశ్యకత..... ఆ విషయం ప్రపంచంలోని ప్రతి ఒక్క స్ర్తీ కి అవగాహన వున్నా.... మరొకసారి 25సంవత్సరాలు అనుభవం వున్న డాక్టరుగా, ఒక బాధ్యతగల ప్రభుత్వ వైద్యునిగా.. ఈ క్రింది ముఖ్యమైన విషయాలను మీకు వివరిస్తాను.

1.బిడ్డ పుట్టిన ఒక గంట లోపలే తల్లి పాలు బిడ్డకు అందించడంతో, బిడ్డ ఆరోగ్యంగా వుండడమే కాక ఎంతో మంది శిశు మరణాలను అరికట్టవచ్చు. ఇటీవల శిశుమరణాల సంఖ్య కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటోంది.

2.తల్లి,తన బిడ్డకు పాలివ్వడం ద్వారా బిడ్డతో ఒక చక్కటి బాంధవ్యం ఏర్పడటమే కాకుండా గర్బసంచి చక్కగా నార్మల్‌ సైజ్‌కి రావటానికి,బ్లీడింగ్‌ తగ్గడానికి దోహద పడుతుంది.

3.బిడ్డకు ఏ విధమైనinfection రాకుండా చూడకుండా చూడడమే కాకుండా ...ఎంతోimmunity ( రోగనిరోధక శక్తి ) కూడా పెరుగుతుంది ఆ బిడ్డలో...క్రమపద్ధతిలో బిడ్డకు పాలిస్తే.. తప్పక ఆ శిశువు ఆరోగ్యంగా ఎదుగుతుంది.

4. తల్లికీ మొదటి 3నెలల అండం విడుదల కాకుండా ఒక టెంపరరీ ఫ్యామిలీ ప్లానింగ్‌ మెథడ్‌ గా పని చేస్తుంది.తల్లి ఆరోగ్యంగా ఉండగలిగీతే బిడ్డకు సరిపడేంత పాలివ్వవచ్చు. అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి కూడ పుష్కలంగా పాలు తాగుతూ సరైన డాక్టరు సలహాలతో అవసరం అయిన మందులు వాడవలసి వస్తుంది. స్ర్తీలు గర్భవతులుగా ఉన్నప్పుడే పోషకవిలువలు ఉన్న ఆహారం సమపాళ్లలో తినాలి.

ఎక్కువశాతం విటమెన్లు ఉండే అన్ని రకాల సీజనల్‌ పండ్లను గర్భవతులు విధిగా తింటుండాలి. చివరగా..... Hiv positive సోకిన తల్లులు బిడ్డకు పాలిసే Hiv ఇన్‌ఫెక్షన్‌ ఆ పుట్టిన బిడ్డకు సోకే అవకాశం ఉందనే వారు. కానీ ఇపుడు వున్న నిబంధన ఏమంటే సరియైన జాగ్రత్తలతో బిడ్డకు అవసరమైన మందులు వాడుతూ, తల్లి పాలు తాగిస్తే ప్రమాదం లేదు. ఈ విషయంలో ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందాల్సిన పనిలేదు. కాబట్టి ప్రతి తల్లీ గుర్తుంచుకోవలసిన విషయం..... కనీసం బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు...తల్లి విధిగా పాలు ఇవ్వడం అవ శ్యం. ..ఆ విధంగా అనేకమయిన విలువ కట్టలేని ప్రయో జనా ల్ని స్ర్తీలు పొంద గలు గుతారు.

సర్వే స్ర్తీ సుఖి నోభవంతు.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details