బొల్లి మచ్చలతో ప్రాణాపాయమేమీ ఉండదు. కానీ, అవి మనిషిని మనిషిని కాకుండా చేస్తాయి. రోజురోజుకూ శరీరమంతా వ్యాపించే తెల్లటి మచ్చలు తీవ్రమైన ఆత్మన్యూనతా భావానికి గురిచేస్తాయి. ఎవరితోనూ కలవలేని ఏకాకితనానికి గురిచేస్తాయి. వృత్తిపరమైన వెనుకబాటే కాదు, పెళ్లి సంబంధాలు కూడా రాకుండా పోతాయి. అయితే, ఈ వ్యాధికి అసలు చికిత్సేలేదు అన్న అపోహే ఈ పరిస్థితికంతా కారణమవుతోంది. నిజానికి యునాని వైద్య విధానంలో బొల్లి వ్యాధిని ( విటిలిగో) నయం చేసే అద్భుతమైన మందులు ఉన్నాయి. అందుకే బొల్లి వ్యాధిని నియంత్రించడం, నిర్మూలించడం సాధ్యమేనంటున్నారు, యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం జహాన్. ఆ వివరాలేమిటో చూద్దామా మరి !
ఎదురైన వాళ్లంతా ఎగాదిగా చూసే వారే. ఆ చూపులు తాకిన ప్రతి సారీ లోలోపల ఏదో ఘర్షణ. ఏదో ఆత్మన్యూనత కారణం ముఖం మీది మచ్చలే. ఇది బొల్లి వ్యాధి సోకిన కొందరి అంతరంగ స్థితి. నిజానికి ఎన్నో తీవ్ర వ్యాధులకు చికిత్సలు ఉన్నాయి. కానీ, ఆ నిజం తెలియడానికి ఒక్కోసారి ద శాబ్దాలు పడుతుంది. ఒక్కోసారి జీవితకాలమే అయిపోతుంది. ఒక వైద్య వి«ధానంలో మందులు లేకపోతే, మరో వైద్య విధానంలో ఉన్నాయేమో అని తెలుసుకునే ప్రయత్నం చాలా సార్లు చేయం. అందుకే కొన్నిసార్లు జీవితమంతా ఆ వ్యా«ధి కారణంగా నరకం అనుభవిస్తాం. యునాని వైద్య విధానంలో బొల్లి వ్యాధికి దశాబ్ధాల క్రితం నుంచే చికిత్సలు ఉన్నాయి. కానీ, ఆవిషయం తెలిసింది కొందరికే.
బొల్లి మూలాలేమిటి ?
చర్మంలో మెలనిన్ అనే పదార్థంతో తయారయ్యే మెలనోసైట్స్ ఉంటాయి. వీటితో నే చర్మానికి ఒక రంగు ఏర్పడుతుంది. ఏకారణం చేతనైనా మెలనోసైట్స్ శరీరంలో తగ్గిపోయినప్పుడు చర్మం మీద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. అలా మచ్చలు ఏర్పడటాన్నే బొల్లి ( విటిలిగో) అంటారు. ఈ మచ్చలు పాలరంగులో గానీ పింక్ రంగులో గానీ ఉంటాయి. కొన్ని మచ్చలు శరీరంలో ఏదో ఒకచోట మొదలై అక్కడే ఉండిపోతాయి. ఆ సమస్యను లోకలైజ్డ్ విటిలిగో అంటారు. అలా కాకుండా క్రమంగా శరీరంలోని వివిధ భాగాలకు విస్తరిస్తే జనరలైజ్డ్ విటిలిగో అంటారు. మెలనోసైట్స్ శరీరంలో పూర్తిగా లేకుండా పోతే చర్మంతో పాటు జుత్తు కూడా తెల్లగా మారిపోతుంది. ఈ స్థితిలో సూర్యరశ్మిని తట్టుకోవడం కష్టమవుతుంది.
కొందరిలో ఇది పుట్టగానే మొదలవుతుంది. ఆ తరువాత క్రమంగా శరీరమంతా విస్తరిస్తుంది కొందరిలో ఇది మొత్తంగా కాకుండా ముఖంలో ఏదో ఒక పక్కనే రంగులేకుండా పోతుంది. దీని వల్ల ముఖం రెండు విరుద్ధమైన రంగులతో కనపడుతూ ఉంటుంది. ఇది పైకి రూప సంబంధమైన సమస్యగానే కనపడ వచ్చు గానీ, ఇది ఎంతో మానసిక వ్యధకు గురిచేస్తుంది. నిర్మలమైన ఒక మచ్చలేని చర్మం మనిషి ఆత్మగౌరవాన్ని ఇనుమడింప చేస్తుంది. అది కొరవడితే కలిగే భాధేమిటో ఆ వ్యాధికి గురైన వారికే తెలుస్తుంది. బొల్లి వ్యాధితో ప్రాణాపాయమేమీ ఉండదు కానీ, అది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి జీవితాన్ని కుంగదీస్తుంది. నలుగిరిలో కలిసిపోకుండా చేసే ఈ వ్యాధి ఒక సాంఘిక సమస్య కూడా.
సుమారు 4 శాతం మంది భారతీయులు ప్రస్తుతం ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు గురయ్యే వారిలో స్త్రీపురుషులిరువురూ సమానంగానే ఉంటున్నారు. కొందరిలో ఒకే ఒక్క మచ్చ ఏర్పడితే మరికొందరిలో ఎక్కువ సంఖ్యలోనూ ఏర్పడవచ్చు. ఎక్కువగా ముందు కాలివేళ్లు, చేతివేళ్ల చివర్లలో మొదలై క్రమంగా శరీరమంతా పాకుతుంది. ఈ వ్యాధి ఎక్కువ మందిలో చాలా నిదానంగా వ్యాపిస్తుంది. కొందరిలో మాత్రం ఇది చాలా వేగంగా శరీరమంతా వ్యాసిస్తుంది. సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల లోపు వయసులోనే ఇది మొదలవుతుంది. ముఖం, అర చేతులు, పాదాల్లోనే ఈ బొల్లి మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. వ్యాధి మొదలైన తొలిరోజుల్లో తెల్ల మచ్చలు పాక్షికంగానే కనిపిస్తాయి. కాలం గడిచే కొద్దీ ఈ మచ్చలు శరీర మంతా వ్యాపిస్తాయి.
జన్యుమూలాలు
బొలి వ్యాధి రావ డానికి 20 నుంచి 30 శాతం వరకు జన్యుపర మైన కారణాలే కనిపిస్తాయి పరిశీలిస్తే ఆమేరకు మనకు వారసత్వ మూలాలే కనిపిస్తాయి. జన్యువ్యవస్థ తన స్థిరత్వాన్ని కోల్పోవడం కూడా కారణమే. వర్ణానికి మూలంగా ఉండే మెలనిన్ జన్యువుల మీదే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగే మెలనోసైట్ హార్మోన్లను, అడిరినో హార్మోన్లను ఉత్తేజపరిచే పిట్యూటరీ గ్రంధి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఈ గ్రంధి సక్రమంగా పనిచేయలేకపోవడం కూడా బొల్లివ్యాధికి దారి తీయవచ్చు
ఇమ్యూనిటీ లోపాలు
మిగతా వారిలో బొల్లి రావడానికి వేరు వేరు కారణాలు కనిపిస్తాయి. వాటిలో ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి ( ఇమ్యూనిటీ) లోపాలే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ఈ లోపాలు ఉన్న వారిలో యాంటీబాడీస్ బలహీనపడతాయి. ఫలితంగా చర్మానికి వర్ణాన్నిచ్చే మెలనోసైట్స్ దెబ్బ తినడమో లేదా పనిచేయలేకుండా పోవడమో జరుగుతుంది. ఈ స్థితిలో శరీరంలోని యాంటీబాడీస్‌ను తిరిగి శక్తివంతంగా మార్చడమే ఈ వ్యాధికి సరియైన చికిత్స అవుతుంది యునాని వైద్య విధానంలో ఈ దిశగానే చికిత్స ఉంటుంది.
రసాయనాలు చేరినా...
-నాడీ వ్యవస్థలోని కొన్ని తేడాలు కూడా బొల్లి వ్యాధికి కారణమవుతాయి. నరాల్లో కొన్ని న్యూరో కెమికల్ మీడియేటర్స్ అనే రసాయనాలు విడుదల కావడం వల్ల గానీ, రక్తనాళాలు గట్టిపడే మల్టిపుల్ స్క్లిరోసిస్, హార్నర్స్ సిండ్రోమ్ వంటి జబ్బుల కారణంగా గానీ వర్ణాన్నిచ్చే మెలనోసైట్స్ దెబ్బ తింటాయి.
-టైరోసిన్ లేదా డీహైడ్రాక్సీ- ఫినైలాలామిన్ లేదా ఇతరమైన హానికారక అంశాలు కూడా మెలనోసైట్స్‌ను దెబ్బ తీస్తాయి. ఇవే కాకుండా శరీరంలో పేరుకున్న సింథటిక్ ఫినాల్ కంపౌండ్స్ కూడా బొల్లి వ్యాధికి దారి తీస్తాయి.
-ఫుడ్ అలర్జీ, జీర్ణకోశ వ్యాధులు, ఆకలి తగ్గిపోవడం, కడుపులో కొన్ని రకాల సూక్ష్మక్రిములు చేరిపోవడం, దీర్ఘకాలికంగా యాంటీబయాటిక్స్ వాడటం, అతిశ్రమ, మానసిక ఒత్తిళ్లు కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఇవే కాకుండా మోనోబెంజైల్, హైడ్రోక్వినాన్, టెట్రాబూటిల్‌ఫినోల్ వంటి రసాయనాలకు దగ్గరగా పనిచేయడం వంటివి కూడా ఈ వ్యాధికి కారణమవుతాయి.
-నాణ్యతలేని వస్తువులు, కాస్మటిక్స్, కండోమ్స్, చేతి తొడుగులు, ఫోటోగ్రాఫిక్ కెమిక ల్స్ వినియోగం వల్ల శరీరంలో కొన్ని అసహజమైన యాంటీజెన్లు ఉత్పన్నమవుతాయి. ఇవి కూడా మెలనోసైట్స్‌ని దెబ్బ తీస్తాయి.
నివారణేమిటి ?
వ్యాధి నిరోధక శక్తి లోపాలు ఈ వ్యాధికి ప్రధాన కారణం కావడం వల్ల ఆ శక్తిని పెంపొందించే దిశగా యునాని వైద్యం కొన సాగుతుంది. నిజానికి శరీరమంతా వ్మాపించిన బొల్లి వ్యాధి (జనరలైజ్డ్) చాలా త్వరితంగా తగ్గుముఖం పడుతుంది. అలా కాకుండా శరీరంలో ఏదో ఒక భాగం మీద మాత్రమే ఉండే మచ్చలు తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. వ్యాధి ఎంత కాలంగా ఉందన్న దాని మీద చికిత్సా కాలం ఆధారపడి ఉంటుంది.
కొన్ని సార్లు మచ్చలు తగ్గుముఖం పట్టకపోవడంలో ఆలస్యమైనా, అవి ఇంకా పెద్దవి కాకుండా ఆగిపోతాయి. మచ్చలు ఏరకం అయినా అటుఇటుగా ఓ రెండేళ్ల కాలంలో తగ్గిపోతాయి. అయితే, వైద్యచికిత్సలను మధ్యలోనే మానేసే వారే ఎక్కువ. అలా కాకుండా వైద్యులు సూచించిన మేరకు పూర్తి కాలం చికిత్స తీసుకున్నప్పుడే వ్యాధి పూర్తిగా నయమవుతుంది.
| Related articles: |
|---|
|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Samantha Photos telugu actress photos,Samantha Photos actress Pictures, Samantha Photos actress gallery, Samantha Photos actress stills,samantha stills See details
Tamanna Photo Gallery, tamanna stills, Tamanna Pictures, Tamanna sexy pics, Tamanna images, Tamanna wallpapers, Tamanna photos, Tamanna See details
Kajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures New See details
Telugu Actress Priyamani Photo Gallery, Priyamani photo gallery, Priyamani photos, Actress Priyamani Photo Gallery, Priyamani hot gallery, Priyamani wallpapers, actress Priyamani hot, Priyamani hot pictures, Priyamani hot See details
Telugu Actress Asin Photo Gallery, Asin photo gallery, Asin photos, Actress Asin Photo Gallery, Asin hot gallery, Asin wallpapers, actress Asin hot, Asin hot pictures, Asin hot images. See details
Nitya Menon Gallery telugu actress photos,Nitya Menon Gallery actress Pictures, Nitya Menon Gallery actress gallery, Nitya Menon Gallery actress stills See details
Telugu Actress Ileayana Photo Gallery, Ileayana photo gallery, Ileayana photos, Actress Ileayana Photo Gallery, Ileayana hot gallery, Ileayana wallpapers, actress Ileayana hot, Ileayana hot pictures, Ileayana hot See details
Tapsee photo gallery, Telugu Actress Tapsee Photo Gallery, Tapsee Picture Gallery, Tapsee Stills, Tapsee Hot Photo Gallary, Tapsee spicy photos, Tapsee hot, Tapsee sexy, Tapsee gallery See details
Actress Anushka hot gallery, Actress Anushka photos, Actress Anushka stills, Anushka hot Stills, Actress Anushka, anushka photos See details