నాగార్జున తనయుడు నాగచైతన్య, రాధ కుమార్తె కార్తీకలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వాసూవర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘జోష్’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి వస్తున్న 9వ చిత్రమిది.
ఆరు నెలల క్రితం ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నాం. కాని సాంకేతికంగా ఇంకా మెరుగ్గా రావాలనే ఉద్ధేశ్యంతో కొంచెం ఆలస్యం అయినా నాగార్జున పుట్టిన రోజు ఆగస్ట్ 29న విడుదల చేయాలనుకున్నాం. కాని మేము అనుకున్న క్వాలిటీతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా చిత్రానికి నాగార్జునగారే మొదటి ప్రేక్షకుడు. ఆయన సినిమా చూసి ‘చాలా బాగుంది, ఇప్పుడు ‘సంతోషం’గా నిద్రపోతాను’ అనడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శకుడు వాసూవర్మ చెప్పిన దానికంటె చాలా బాగా తీసాడు. నా గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో పాటలు కొంచెం స్లోగా వున్నాయని విన్నాను. కాని ఇందులో అన్ని పాటలు సందర్భానుసారం వస్తాయి. సినిమా విడుదలైతే పాటలు మరింత పాపులర్ అవుతాయి’’ అన్నారు.
| Nagarjuna Birthday Photos, Nagarjuna Birthday Stills, Nagarjuna Pictures< Prev | Next >Prabhas actor Pictures Photos Gallery |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details