Saturday, 25 May 2013 10:13
Nandi Awards 2009 & 2010 presented
The prestigious Nandi Awards are presented annually by the Government of Andhra Pradesh for Telgu films
వైభవంగా నందుల ప్రదానం
-తారలు దిగివచ్చిన వేళ.. కళకళలాడిన కళాతోరణం
-సినీ పరిశ్రమను ఆదుకుంటాం
-వ్యాట్ తొలగింపుపై త్వరలో నిర్ణయం
-ప్రతి ఉగాదినాడు నందుల ప్రదానం
-ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
-అట్టహాసంగా 2009, 2010 నంది అవార్డుల ప్రదానోత్సవం
2009, 2010 సంవత్సరాలకుగాను నంది అవార్డులు, జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం శుక్రవారం హైదరాబాద్‌లోని లలిత కళాతోరణంలో జరిగింది. ఈ కార్యక్షికమాన్ని సీఎం కిరణ్‌కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డును 2009 సంవత్సరానికి గాను అలనాటి నటీమణి బీ సరోజాదేవి, 2010 సంవత్సరానికి గాను సీనియర్ నటీమణి శారద అందుకున్నారు. బీఎన్ రెడ్డి జాతీయ చలన చిత్ర అవార్డును ప్రముఖ దర్శకుడు కే రాఘవేంవూదరావు(2009), నిర్మాత బీ నర్సింగరావు (2010) అందుకున్నారు. నాగిడ్డి-చక్షికపాణి జాతీయ అవార్డును ప్రముఖ నిర్మాత సీహెచ్ రామోజీరావు(2009)(ఆయన తరఫున ఆయన కుమారుడు అందుకున్నారు), ఏవీఎం సంస్థ నిర్మాత ఎం సుబ్రహ్మణ్యన్ స్వీకరించారు. రఘుపతి వెంకయ్య అవార్డును సీనియర్ నిర్మాత కే రాఘవ (2009), నటుడు, నిర్మాత, దర్శకుడు ఎం బాలయ్య (2010) అందుకున్నారు. వీటితో పాటు ఈ రెండు సంవత్సరాలకు గాను ఎంపిక చేసిన వివిధ ‘ఉత్తమ’ అవార్డులను పలువురు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు స్వీకరించారు.
నంది అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఇక్కడి లలిత కళాతోరణంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్షికమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 2009 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డును నటి బీ సరోజాదేవికి అందజేశారు. బీఎన్ రెడ్డి అవార్డుని దర్శకుడు కే రాఘవేంవూదరావుకు అందించారు. నాగిడ్డి-చక్షికపాణి అవార్డుకు ఎంపికైన నిర్మాత రామోజీరావు తరఫున ఆయన కుమారుడు స్వీకరించగా.. ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డును సీనియర్ నిర్మాత కే రాఘవ అందుకున్నారు. ఇక 2010 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ అవార్డును శారద స్వీకరించారు. బీఎన్ రెడ్డి అవార్డును దర్శకుడు, నిర్మాత బీ నర్సింగరావు, నాగిడ్డి-చక్షికపాణి అవార్డును ఏవీఎం సంస్థ నిర్మాత ఎం సుబ్రహ్మణ్యన్ అందుకున్నారు. రఘుపతి అవార్డును యం బాలయ్య అందుకున్నారు.
2009 నంది పురస్కారాల విజేతలు : ఉత్తమ చిత్రం ‘సొంత ఊరు’కు గాను దాని నిర్మాత, దర్శకుడు పీ సునీల్‌కుమార్ రెడ్డి అవార్డు అందుకున్నారు. ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపికైన ‘బాణం’ సినిమాకు గాను నిర్మాత ప్రియాంక శేషు అవార్డు అందుకున్నారు. ఉత్తమ తృతీయ చిత్రం ‘కలవరమాయే మదిలో’కు గాను నిర్మాత మోహన్ వడ్లపట్ల పురస్కారం అందుకున్నారు. ఉత్తమ కథా చిత్రంగా ‘కొంచెం కష్టం కొంచెం ఇష్టం’, ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘మగధీర’, ఉత్తమ జాతీయ సమక్షిగత చిత్రంగా ‘జగద్గురు శ్రీ షిరిడి సాయిబాబా’, ఉత్తమ బాలల చిత్రంగా ‘నజరానా’, ఉత్తమ డాక్యుమెంటరీగా ‘కర్తవ్యం’, ఉత్తమ విద్యా విషయక చిత్రం ‘విముక్తి’ ఎంపికవగా.. సంబంధిత దర్శకులు, నిర్మాతలు అవార్డులు స్వీకరించారు. ఉత్తమ దర్శకుడిగా మగధీర చిత్రానికి గాను ఎస్ఎస్ రాజమౌళి అవార్డు అందుకున్నారు. ఉత్తమ నటుడు అవార్డును దాసరి నారాయణరావు మేస్త్రి చిత్రానికి, ఉత్తమ నటి అవార్డును సొంత ఊరు సినిమాకు గాను కుమారి తీర్థ అందుకున్నారు.
ఇతర విభాగాల్లో ఉత్తమ ఫైట్ మాస్టర్స్-రామ్-లక్ష్మణ్ (రైడ్), ఉత్తమ అనువాద కళాకారుడు- రవిశంకర్ (ఆంజనేయులు), ఉత్తమ అనువాద కళాకారిణి- కుమారి సౌమ్య, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్- ఆర్ కమల్ కణ్ణన్(మగధీర), పీసీ సాయినాథ్, శ్రీనివాస్ (మగధీర), ప్రత్యేక జ్యూరీ బహుమతులు- శ్రీకాంత్ (మహాత్మ), రఘుకుంచె (బంపర్ ఆఫర్), పీ కుమారస్వామి(రాజు మహారాజు) రామ్‌చరణ్ (మగధీర), జెనీలియా(కథ), తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం-పులగం చిన్నారాయణ (ఆనాటి ఆనవాళ్లు), తెలుగు సినిమా ఉత్తమ విమర్శకుడు- మామిడి హరికృష్ణ పురస్కారాలు అందుకున్నారు.
2010 నంది పురస్కార గ్రహీతలు: ఉత్తమ చిత్రంగా ‘వేదం’, ఉత్తమ ద్వితీయ చిత్రం ‘గంగపువూతులు’, ఉత్తమ తృతీయ చిత్రంగా ప్రస్థానం’, ఉత్తమ కటుంబ కథా చిత్రంగా ‘అందరి బంధువయా’, ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన పూర్తి వినోదాత్మక చిత్రంగా ‘మర్యాద రామన్న, ఉత్తమ జాతీయ సమక్షిగతా చిత్రంగా పరమవీర చక్ర, ఉత్తమ బాలల చిత్రం లిటిల్ బుద్ధ, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం అద్వైత, ఉత్తమ ద్వితీయ డాక్యుమెంటరీ చిత్రం ఫ్రీడం పార్క్‌ల తరఫున వాటి దర్శకులు, నిర్మాతలు అవార్డులు స్వీకరించారు.
గంగపువూతులు సినిమాకు గాను సునీల్‌డ్డి ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నారు. సింహా చిత్రంలో నటనకు గాను బాలకృష్ణ ఉత్తమ నటుడి అవార్డును స్వీకరించారు. ఉత్తమ నటిగా నిత్యామీనన్, ఉత్తమ సహాయ నటుడుగా ఏవీఎస్, ఉత్తమ సహాయ నటిగా ప్రగతి, ఉత్తమ క్వారెక్టర్ నటుడుగా సాయికుమార్, ఉత్తమ హాస్య నటుడుగా ధర్మవరపు సబ్రమణ్యం, ఉత్తమ హాస్య నటిగా ఝాన్సీ, ఉత్తమ విలన్‌గా నాగినీడు, ఉత్తమ బాల నటుడుగా బీ భరత్ కుమార్, ఉత్తమ తొలి చిత్ర దర్శకురాలు నందినిడ్డి, ఉత్తమ స్ట్రీన్ ప్లే రచయిత గౌతమ్వాస్దేవ్ మీనన్, ఉత్తమ కథా రచయిత ఆర్పీ పట్నాయక్, ఉత్తమ సంభాషణ రచయిత పీ సునీల్‌కుమార్ రెడ్డి, ఉత్తమ పాటల రచయిత నందిని సిధాడ్డి, ప్రసాద్ మూరెళ్ల, చక్రీ, ఎంఎం కీరవాణి, ప్రణవి, కోటగిరి వెంక అశోక్, ప్రేమ్ రక్షిత్, ఇ.రాధాకృస్ణ, పి.రమేష్, రవికుమార్, గంగాధర్, శేఖర్,ఆర్.సి.ఎం.రాజు, చిన్మయి, ఎ.స్వామి నందీ అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. సమంత, చంద్ర సిద్ధార్థ, నాగయ్య, మంచు మనోజ్‌కుమార్,సునీల్ ప్రత్యేక జ్యూరీ అవార్డులు అందుకున్నారు.
ఏ పార్టీ గెలుస్తుందో, ఏ సినిమా హిట్టవుతుందో చెప్పలేం
-సినీ పరిక్షిశమను ఆదుకుంటాం: సీఎం
ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఎవరూ చెప్పలేరని, అలాగే ఏ సినిమా హిట్టవుతుందో ముందే చెప్పలేమని సీఎం కిరణ్‌కుమార్‌డ్డి అభివూపాయపడ్డారు. సినీ పరిక్షిశమను అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తెలుగు లళితకళా తోరణంలో శుక్రవారం సాయంత్రం జరిగిన చలనచిత్ర అవార్డు ప్రదానోత్సవ కార్యక్షికమంలో ఆయన మాట్లాడారు. నంది అవార్డుల ప్రదానోత్సవం కార్యక్షికమాన్ని ఇకనుంచి ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా నిర్వహిస్తామని ప్రకటించారు. వ్యాట్ నుంచి సినీ పరిక్షిశమకు మినహాయింపు ఇచ్చే విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం సినీ కార్మికులకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా సినిమాలు రావాల్సి ఉందన్నారు. సినీ నిర్మాతల ఇళ్లపై జరుగుతున్న ఆదాయం పన్ను అధికారుల దాడులను ఆపాలని ప్రముఖ దర్శక, నిర్మాత దాసరి నారాయణరావు సీఎంను కోరారు. సినిమా ఆడేందుకు నిర్మాతలు కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని ప్రకటలు చేస్తారని, నిజానికి ఏడాదికి కేవలం ఆరు నుంచి ఏడు శాతం సినిమాలే విజయం సాధిస్తున్నాయని చెప్పారు. సినీ కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 69 ఎకరాల భూమిని కేటాయించిందని, అయితే పరిక్షిశమలో పనిచేసే లైట్ బాయ్‌లకు ఒక గది ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలన్నారు
మా నాన్నకు నంది అవార్డు రాలేదు: మంచు మనోజ్ కుమార్
‘ఇప్పటివరకు మా నాన్న (మోహన్‌బాబు) 520 చిత్రాల్లో నటించారు. కానీ ఇంతవరకు ఆయనకు నంది అవార్డు రాలేదు. కానీ నాకు వచ్చింనందుకు గర్వంగా ఉంది’ అని హీరో మంచు మనోజ్‌కుమార్ అన్నారు. విశ్వ విఖ్యాత నటుడు ఎన్టీఆర్ పాదాల వద్ద నంది అవార్డు నాన్న చేతుల మీదుగా పెట్టి పూజ చేస్తానని తెలిపారు.