Magadheera Telugu Movie Review:
Click Here Telugu Magadheera Movie Review,Ram charan tej In ENGLISH
నటీనటులు: రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్, శ్రీహరి, దేవ్‌గిల్, శరత్‌బాబు, సమీర్, సునీల్, బ్రహ్మానందం, హేమ, ముమైత్ ఖాన్, కిమ్‌శర్మ, సలోని తదితరులు.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజమౌళి,
పతాకం: గీతా ఆర్ట్స్,
నిర్మాత: అల్లు అరవింద్,
కథ: విజయేంద్రప్రసాద్,
మాటలు: ఎం. రత్నం,
పాటలు: చంద్రబోసు, భువనచంద్ర, కీరవాణి,
ఆర్ట్: ఆర్. రవీందర్,
ఎడిటింగ్: కోటగిరి.
Magadheera Movie Story:
-తరతరాలుగా రాజ్యం కోసం ప్రాణాలు అర్పించే శతధృవవంశీయునికి చెందిన కాలభైరవుడు (రామ్‌చరణ్). క్రీ.శ. 1609లో ఉదయ్‌ఘడ్ రాజ్యాన్ని ఎలా కాపాడి, చివరికి కాలాన్ని కూడా జయించి, 400 ఏళ్ళనాటి ప్రేమను ఈ జన్మలో ఎలా దక్కించుకున్నాడన్నదే "మగధీర" చిత్ర కథాంశం.
"చావులోనైనా తోడు ఇవ్వవా..?" అంటూ యువరాణి మిత్రబృంద (కాజల్ అగర్వాల్) భైరవుడిని తన చేతిలోకి తీసుకుంటూ ఆరావళి పర్వాతాల్లో పడి చనిపోవడం, ఆమెనే భైరవుడు అనుసరించడంతో కథ ప్రారంభమౌతుంది.
హర్ష (రామ్ చరణ్ తేజ)అనే కుర్రాడు సాహస ప్రియుడు. అతను బైక్ రేసుల్లో డబ్బులు సంపాదిస్తుంటాడు. అతను ఒకసారి అనుకోకుండా ఇందు (కాజల్ అగర్వాల్) అనే అందమైన అమ్మాయిని తాకుతాడు. ఆమెను అలా టచ్ చేయగానే అతనికితెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. అతనికి పూర్వజన్మ గుర్తుకు వస్తుంది. దాంతో అతను ఆమె ప్రేమలో పడతాడు. రఘువీర్ అనే అతను కూడా ఇందు వెంటపడుతూంటాడు. నిజానికి హర్ష పోయిన జన్మలో కాలభైరవుడనే యోధుడు. అది నాలుగు వందల సంవత్సరాల క్రిందటి సంగతి. 1609లో ఉదయ్ ఘడ్ అనే రాజ్యానికి సైనిక శిక్షకుడిగా కాలభైరవుడుండేవాడు.
చివరికి ఆమెను పట్టుకుని ఆమె ఇందిర అని, గత జన్మలో యువరాణి మిత్రబృంద (కాజల్ అగర్వాల్)గా హర్ష ఓ నిర్ణయానికి వస్తాడు. ఈ విషయం మిత్రబృందకు తెలియదు. మరోవైపు అలనాటి ఉదయ్‌ఘడ్ కోటను ఇందిర కుటుంబానికి దక్కకుండా చేస్తుంటాడు మేనమామ రణదీప్ (దేవ్‌గిల్). తనకు దక్కనిది మరొకడికి దక్కనీయకుండా చేసే తత్త్వం రణదీప్‌ది.
అలా ఇందిర తనది కావాలంటే హర్షను చంపాలి. ఇలా ఇందిరను దక్కించుకునే సమయంలో ఏదో తెలియని శక్తి రణదీప్‌ను అడ్డుకుంటుంది. వెంటనే రణదీప్ అఘోరాను సంప్రదిస్తే ఇది పూర్వజన్మ వాసన అంటూ 400 ఏళ్ళనాటి చరిత్రను కళ్ళముందుంచుతాడు. (ఇక్కడంతా అరుంథతి సినిమా గుర్తుకువస్తుంది. అందులోనూ అరుంధతిని అనుభవించాలని కామవాంఛతో రగిలిపోయే పశుపతి పాత్రకు రణదీప్ పాత్రకు పోలిక కన్పిస్తుంది).
ఉదయ్‌ఘడ్‌కు రాజు శరత్‌బాబు. శరత్‌బాబు కుమార్తె మిత్రబృంద (కాజల్ అగర్వాల్). 400 ఏళ్లకు కనబడే అష్టగ్రహకూటమి (8 ఉల్కలు) ఆకాశంలో కన్పిస్తుంది. ఇది అరిష్టమని రాజగురువు చెబుతాడు. అనుకున్నట్లుగానే భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలనుకునే ముస్లిం నవాబ్ షేర్‌ఖాన్ (శ్రీహరి) ఉదయ్‌ఘడ్‌పైకి దండెత్తుతాడు.
అదే సమయంలో రాజ్యవారసుడిగా రాజ్యాన్ని కాపాడే వీరయోధుడి కోసం పోటీ జరుగుతుంది. ఈ పోటీలో నెగ్గితే యువరాణి కూడా దక్కుతుంది. ఓడిపోతే దేశబహిష్కరణ అనే నియమాలను రాజు నిర్దేశిస్తాడు. దీనికి రణధీర్, భైరవ్‌లు పోటీపడతారు. భైరవుడే నెగ్గుతాడని తెలిసినా రాజు దిగులు చెందుతాడు.
అనాదిగా వస్తున్న శతధృవవంశీయుడైన భైరవునికి ఆయుష్షు తక్కువ గనుక తన కుమార్తెను ఇవ్వనని భైరవుడితో రాజు చెబుతాడు. కానీ మిత్రబృంద భైరవుడ్నే పెళ్లిచేసుకోవాలనుకుంటుంది. రణదీప్, భైరవుడిల మధ్య జరిగిన పోటీల్లో భైరవుడు నెగ్గడంతో రణదీప్ దేశబహిష్కరణకు గురవుతాడు.
దీంతో రణదీప్ అవమానంతో శత్రుసేనలతో చేతులు కలిపి కోటపై దాడి చేస్తాడు. అడ్డువచ్చిన వారినంతా చంపేస్తాడు. అప్పటికే భైరవుని వీరోచితపోరాటాన్ని చూసి శతధృవ వంశం పేరు ఏ పాటిదో? నిరూపిస్తే.. కోటను, యువరాణిని ఇస్తానని శత్రురాజు హామీ ఇస్తాడు. అలా శత్రువులలోని వందమందిని నరికి నిజమైన శతధృవ వంశీయుడని భైరవుడు నిరూపిస్తాడు.
మళ్లీ ఇక్కడ అవమానం జరగడంతో.. ఇక తనకుదక్కదనుకున్న యువరాణిని రణదీప్ చంపేస్తాడు. స్వచ్ఛమైన ప్రేమకు చావులేదని భైరవుడూ చనిపోతాడు. మళ్ళీ 400 ఏళ్ళనాటికి భైరవుడు జన్మిస్తాడు.
Analysis:
దర్శకుడిగా రాజమౌళికి ఇంతవరకు పరాజయం లేదు. దానికి అతని దీక్ష, అంకితభావం, సినిమా అంటే అతనికి ఉన్నపిచ్చి ప్రేమ, శ్రద్ధ, అతని క్రమశిక్షణ, అభిమానమే కారణాలు కావచ్చు. తెలుగు సినిమా చరిత్రలో అతనికి ఒక సముచిత స్థానం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆ రేంజ్‍కి అతనిప్పుడే ఎదిగాడని చెప్పవచ్చు. కాకపోతే ఈ సినిమాలో మనకు కొద్దిగా "మిత్" చిత్రం లక్షణాలు కనపడతాయి. అయినా దానికీ దీనికీ ఎక్కడా సంబంధం ఉండదు. అతని సినీ కేరీర్‌లో ఇది ఒక ఆణి ముత్యంలా నిలిచిపోతుంది. ఇక ఈ చిత్రం టేకింగ్ పరంగా మనకు హాలీవుడ్ చిత్రాలను తలపిస్తుంది. ఈ మధ్య కాలంలో రాని ఒక అద్భుత చిత్రంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని 40కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆ రిచ్‌నెస్ ఈ చిత్రంలో అణువ అణువునా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు అద్బుతంగా వున్నాయి.
నటునిగా రామ్‌చరణ్ రెండవ చిత్రానికి పెద్ద హీరోగా నిలబడాలని ప్రయత్నించాడు. "చిరుత"తో కంపేర్‌చేస్తే కాస్త మెరుగ్గా ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మాటలు ముద్దగా పలుకుతాడు. గుర్రపు స్వారీ.. డాన్స్‌లపై బాగా శ్రద్ధపెట్టాడు. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో భైరవునిగా చరణ్ ఫిజిక్ సరిపోయింది.
మోడ్రన్‌గానూ పిలకతో విచిత్రంగా ఉన్నా.. ఇది ఫ్యాషన్ అంటూ చిరంజీవికే చెబుతాడు రామ్‌చరణ్. చిరంజీవి, చరణ్ సన్నివేశం చిత్రానికి అతికినట్లుంది. కాజల్ అగర్వాల్ రెండు పాత్రల్ని బాగా పండించింది. ప్రతినాయకుడిగా బాలీవుడ్ నటుడు దేవ్‌గిల్ సమర్థవంతంగా చేశాడు. ఇక షేర్‌ఖాన్ పాత్ర రెండో జన్మలో జాలరిగా నటిస్తాడు. శ్రీకాకుళం మాడ్యులేషన్ నవ్వు తెప్పిస్తుంది.
సంగీతం-: కీరవాణి సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. పాటలన్నీ సందర్భోచితమైన సంగీతంతో ఆకట్టుకుంటాయి. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించటమే కాక ఒక పాట కూడా వ్రాయటం విశేషం. "నీ కోసం జుట్టు పీక్కుంటే" అనే పాట ఆయనే రచించి స్వరబద్ధంచేశారు. యువతనాకట్టుకునేలా ఉన్న ఈ పాటకు, "పంచదార బొమ్మ" అనే చక్కని మెలోడీ పాటకూ ప్రేక్షకుల నుంచు మంచి స్పందన లభించగా, పాతికేళ్ళక్రితం కీరవాణే స్వరబద్ధం చేయగా, చిరంజీవి నటించిన "ఘరానామొగుడు" చిత్రంలోని "బంగారు కోడిపెట్ట" అనే పాటకు మరింతగా ప్రేక్షకులు స్పందించారు.
ఇకపోతే.. విజయేంద్రప్రసాద్ కథకు ఎం. రత్నం మాటలు పొందికగా ఉన్నాయి. పీటర్ హేన్స్, రామ్ లక్ష్మణ్ ఫైట్స్ బోర్ అనిపించవు. మాస్‌ను బాగా ఆకట్టుకుంటాయి. క్లాస్‌కు పర్వాలేదనిపిస్తుంది. మగధీరకు పెట్టిన ఖర్చు తెరపై కన్పిస్తుంది. మరి "మగధీర" ఎంతమేరకు ప్రేక్షకుల కాల భైరవుడు అనిపించుకుంటాడో? వేచి చూడాల్సిందే..!.
Related Articles:
| Related articles: |
|---|
|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Samantha Photos telugu actress photos,Samantha Photos actress Pictures, Samantha Photos actress gallery, Samantha Photos actress stills,samantha stills See details
Tamanna Photo Gallery, tamanna stills, Tamanna Pictures, Tamanna sexy pics, Tamanna images, Tamanna wallpapers, Tamanna photos, Tamanna See details
Kajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures NewKajal Agarwal Telugu Actress Hot Pictures New See details
Telugu Actress Priyamani Photo Gallery, Priyamani photo gallery, Priyamani photos, Actress Priyamani Photo Gallery, Priyamani hot gallery, Priyamani wallpapers, actress Priyamani hot, Priyamani hot pictures, Priyamani hot See details
Telugu Actress Asin Photo Gallery, Asin photo gallery, Asin photos, Actress Asin Photo Gallery, Asin hot gallery, Asin wallpapers, actress Asin hot, Asin hot pictures, Asin hot images. See details
Nitya Menon Gallery telugu actress photos,Nitya Menon Gallery actress Pictures, Nitya Menon Gallery actress gallery, Nitya Menon Gallery actress stills See details
Telugu Actress Ileayana Photo Gallery, Ileayana photo gallery, Ileayana photos, Actress Ileayana Photo Gallery, Ileayana hot gallery, Ileayana wallpapers, actress Ileayana hot, Ileayana hot pictures, Ileayana hot See details
Tapsee photo gallery, Telugu Actress Tapsee Photo Gallery, Tapsee Picture Gallery, Tapsee Stills, Tapsee Hot Photo Gallary, Tapsee spicy photos, Tapsee hot, Tapsee sexy, Tapsee gallery See details
Actress Anushka hot gallery, Actress Anushka photos, Actress Anushka stills, Anushka hot Stills, Actress Anushka, anushka photos See details