మారాలంటే మల్ల్లెతీగలా!
''వధువంటే... చెక్కిన శిల్పంలా సన్నగా కనిపించాలి. అందుకోసం ఇప్పటి నుంచే డైటింగ్ చేయడం మొదలుపెట్టు. ఆ తర్వాత లావైనా పరవాలేదు..' అంటూ కాబోయే పెళ్లి కుమార్తెకు రకరకాల సలహాలిస్తుంటారు ప్రతి ఒక్కరూ. కేవలం ఆటపట్టించేందుకు అన్నా కూడా... ఈ మధ్య ఇలాంటివారు ఎక్కువగా కనిపిస్తున్నారంటోంది ఓ అధ్యయనం.
యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా సుమారు 6,949 మందిపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. పెళ్లయిన ఏడాదిలోపే స్థూలకాయులుగా మారిపోతున్నారు అమ్మాయిలు. డేటింగ్ చేస్తున్న వారితో పోలిస్తే.. పెళ్లయిన యువతుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్కసారిగా జీవనవిధానంలో వచ్చిన మార్పులే ఇందుకు కారణం అంటున్నారు అధ్యయనకర్తలు.
అయితే.. పెళ్లయ్యాకా.. మునుపటిలా సన్నగా ఉండటం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ముఖ్యంగా ఆరోగ్యంతోపాటు.. ఆనందకరమైన వైవాహిక జీవితానికి మంచి పునాది పడుతుంది. నూతన వధువుగా నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే.. సన్నగానే ఉండాలి. దానివల్ల మీలోనూ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అంటున్నారు ఫిట్‌నెస్ గురువులు.
అధిక బరువు ఎందుకు
ముందు పేర్కొన్నట్లు జీవన విధానంలో మార్పులు.. మొదటి కారణం. ఇక, పెళ్లి తర్వాత చోటుచేసుకునే వేడుకలు.. బంధువుల ఇళ్లకు వెళ్లడం.. అదేపనిగా తినడం.. వ్యాయామం చేసేందుకు సమయం లేకపోవడం.. లాంటివన్నీ ఈ సమస్యకు దారితీస్తున్నాయి.
ఇవీ సూచనలు
* లావైతే.. అదేదో సంతోషానికి సూచనగా భావించకూడదు. పెళ్లయినా కూడా సన్నగానే కనిపించాలి. ఆహ్వానాలు.. విందుభోజనాలతో ఎంత బిజీగా ఉన్నా.. కాస్త సమయం కల్పించుకుని రోజూ యోగా చేయడం తప్పనిసరి. బరువూ అదుపులో ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది.
* సన్నగా ఉండటం.. మీ ఆరోగ్య రహస్యానికి నిదర్శనం. అల్పాహారం తప్పనిసరిగా తీసుకోండి. అప్పుడే మధ్యాహ్న భోజనం పరిమితంగా చేయగలుగుతారు. మధ్యమధ్య ఓ పండు.. లేదా నట్స్ తినడం అలవాటుచేసుకోండి.
* టీవీ చూస్తూ కాకుండా.. ఇద్దరూ కలిసి హాయిగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం కానివ్వండి. ఒకవేళ రెస్టారంట్లకు వెళ్లినా.. కొవ్వుశాతం తక్కువగా ఉన్నవాటినే ఆర్డరివ్వడం మరవకండి.
* బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు.. రకరకాల వంటకాలు నోరూరిస్తాయి. తినండి కానీ పరిమితంగానే. ఇంకా తినమంటూ ఇబ్బందిపెడితే నిర్మొహమాటంగా వద్దని చెప్పండి.
* ఇద్దరూ కలిసి వ్యాయామం చేయడం మొదలుపెడితే... ఒకరికొకరు ప్రేరణగా నిలుస్తారు. అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరంలేదు. ఇద్దరూ కలిసి రోజూ కాసేపు నడిచినా సరిపోతుంది. ఇద్దరిమధ్యా అవగాహనా పెరుగుతుంది.
* కూరగాయలతో చేసిన సలాడ్లు.. పండ్లు.. లాంటివన్నీ మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి.
పైవన్నీ చిన్నచిన్న జాగ్రత్తలే కాబట్టి.. ఆచరించడం సులువే. మొదలుపెట్టండి మరి!
| సులువుగా బరువు తగ్గుదాం! Quick Weight Loss Secrets< Prev |
|---|
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details