User Rating: / 1
PoorBest 

సులువుగా బరువు తగ్గుదాం!
బరువు తగ్గడానికి వ్యాయామం, డైటింగ్‌ ఎంత ముఖ్యమో .. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడమూ అంతే అవసరం. వంట పాత్రల వినియోగంతో రోజూ కాసింత బరువు తగ్గడం సాధ్యమేనని మీకు తెలుసా?

* వంటల్లో వేడే, నూనె, డాల్డా, నెయ్యి వంటి వాటిని కచ్చితమైన కొలత కాకుండా ఉజ్జాయింపుగా వాడేస్తాం. కానీ కొలత ప్రకారం వాడితే కొవ్వు శాతాన్ని తగ్గించుకోవచ్చు. అందుకు కప్పులు, చెంచాల కొలతలు తెలుసుకోవాలి. ఒక కప్పు - 240 మి.లీ, అరకప్పు - 120 మి.లీ, 1/3 వంతు కప్పు - 80మి.లీ, 1/4 వంతు కప్పు - 60మి.లీలు. అలాగే ఒక టీస్పూన్‌- 5మి.లీ, టేబుల్‌స్పూన్‌ - 15మి.లీలతో సమానం. వీటితో పాటు కొలతలు సూచించిన జారును ఉపయోగించాలి.

* పప్పును ఉడికించుకోవడానికి ఎక్కువగా కుక్కర్‌ వాడతాం. ఇతర కూరగాయలను దీనిలో ఉడికించి తీసుకోవడం మంచిది. దానివల్ల కూరగాయల్లోని విటమిన్లు మనకు అందుతాయి. నూనె వినియోగం తక్కువగా ఉంటుంది. సమయం సద్వినియోగం అవుతుంది.

* రెస్టారంట్లకు వెళ్ళినప్పుడు గమనించండి. పదార్థాలను ఒకేసారి ప్లేటు నిండా వడ్డించకుండా చిన్న ప్లేట్లలో కొంచెంకొంచెంగా వడ్డిస్తారు. ఇంట్లోను ఇలాంటి పద్ధతిని అనుసరించటం మంచిది. అప్పుడు కొంచెంగా తీసుకుంటాం. ఆకలిని బట్టి వడ్డించుకునే వీలు ఎలాగు మన చేతుల్లోనే ఉంటుంది.

* డైటింగ్‌ చేసేవారు ఎక్కువగా పండ్లు, పళ్లరసాలు తీసుకుంటారు. ఇవి బరువును పెంచే కారకాలే. వాటిల్లో పంచదార శాతం అధికం. ఎక్కువ మోతాదులో తీసుకుంటాం కాబట్టి శరీరానికి కార్బోహైడ్రేట్స్‌ ఇతోధికంగా అందుతాయి. వాటికి బదులు ఆస్పారగస్‌, బీట్‌రూట్‌, బ్రకోలి, క్యాబేజి, క్యారెట్‌, పాలకూర వంటి కూరగాయల రసాలు తీసుకోవడం మంచిది.

* తక్కువ పరిమాణంలో ఉండే లంచ్‌బాక్సులను ఎంచుకోవడం వల్ల కొన్ని కెలోరీలు తగ్గించుకోవచ్చు. దాన్లో అన్నంతో పాటు పండ్లు, కూరగాయల సలాడ్లను తీసుకెళ్లడం ఉత్తమం. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంతో పాటు కొవ్వును తగ్గిస్తాయి.

* వేపుళ్లు రుచిగా ఉండటం కోసం ఇనుప, రాగి పాత్రలను ఉపయోగిస్తుంటారు. కాని వాటివల్ల నూనె వాడకం అధికం. నాన్‌స్టిక్‌ ప్యాన్‌లను వాడితే తక్కువ నూనె పడుతుంది.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details