అసెంబ్లీ సమావేశాల భద్రతపై సమీక్ష

హైదరాబాద్: శాసనసభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు భద్రతపై దృష్టిసారించారు. సోమవారం అసెంబ్లీ స్పీకర్ చాంబర్‌లో మండలి చైర్మన్ స్వామిగౌడ్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దీనికి డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్‌త్రివేది, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్‌భగవత్, స్పెషల్ పోలీస్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు తదితరులు హాజర య్యారు. సమావేశం అనంతరం హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శాసనసభ, శాసనమండలి ఆవరణలో కలియదిరిగారు. పార్కింగ్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడెక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టాలో సిబ్బందికి సూచించారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు మజ్లిస్ ఎమ్మె…

Read More

విరాట్ కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ.. ధోనీ అజేయ హాఫ్ సెంచ‌రీల‌తో.. టీమిండియా థ్రిల్లింగ్‌ విక్ట‌రీ కొట్టింది.

విరాట్ కోహ్లీ సూప‌ర్ సెంచ‌రీ.. ధోనీ అజేయ హాఫ్ సెంచ‌రీల‌తో.. టీమిండియా థ్రిల్లింగ్‌ విక్ట‌రీ కొట్టింది. అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండ‌వ వ‌న్డేలో భార‌త్ ఆరు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. దీంతో మూడు వ‌న్డేల సిరీస్ 1-1తో స‌మం అయ్యింది. చివ‌రి ఓవ‌ర్ వ‌ర‌కు సాగిన గేమ్‌లో.. కోహ్లీ, ధోనీలు తమ బ్యాటింగ్ ట్యాలెంట్‌తో ఆక‌ట్టుకున్నారు. ఆసీస్ విసిరిన 299 ర‌న్స్ టార్గెట్‌ను.. భార‌త్ మ‌రో 4 బంతులు మిగిలి ఉండ‌గానే అందుకున్న‌ది. ఆఖ‌రి ఓవ‌ర్‌లో ధోనీ ఓ సిక్స‌ర్‌, సింగిల్‌తో.. భార‌త్‌కు సూప‌ర్ విక్ట‌రీ అందించాడు. రోహిత్ శ‌ర్మ 43, దినేశ్ కార్తీక్ 25 నాటౌట్‌తో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు….

Read More

16వ తేదీ సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీ సాయంత్రం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ 16న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు రెండు గంటల పాటు రాజ్‌భవన్ వైపు వెళ్లే మార్గాలన్నీ మూసివేయనున్నారు. దీనికి నగర ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని పోలీసులు సూచించారు.

Read More

తారక్‌కి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది!

తారక్‌కి బాబాయ్‌ ఇచ్చిన గౌరవం అది!

‘ఎన్టీఆర్‌ బయోపిక్‌లో చిన్న ఫొటో కనిపించినా చాలు..’ అని చెప్పిన కల్యాణ్‌రామ్‌కి ఏకంగా హరికృష్ణ పాత్ర దక్కింది. చైతన్య రథ సారథి హోదా వచ్చింది. తాతగారి కథ.. బాబాయ్‌ తీస్తున్న సినిమా.. అందులోనూ నాన్న పాత్ర! ఇంతకంటే కల్యాణ్‌రామ్‌కి ఏం కావాలి? అందుకే కల్యాణ్‌ రామ్‌ కళ్లలో కొత్త వెలుగు కనిపిస్తోంది. ‘‘తెలుగు వారి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చేసిన మహనీయుడు ఎన్టీఆర్‌. ఆయన మనవడిగా కాదు.. ఓ అభిమానిగా ఆయన కథని వెండి తెరపై చూసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నా’’ అంటున్నారాయన.  ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ ఈనెల 9న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌రామ్‌‌ గురువారం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సంభాషించారు. హరికృష్ణగా కల్యాణ్‌ రామ్‌.. అసలు…

Read More

తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామంటూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు

తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామంటూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు

తాము తెలంగాణ రాష్ట్రంలో కలుస్తామంటూ మహారాష్ట్రకు చెందిన 40 గ్రామాల సర్పంచులు డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం తమకు ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టడం లేదని.. కనీసం తాగునీరు కూడా లేక ధర్మాబాద్ తాలూకాలోని 35 గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీటిని తాగి రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరిగ్గా ఉండటం లేదని.. రూ.600 పింఛన్ ఇవ్వడానికి పదిసార్లు తిప్పుకుంటారని విచా రం వ్యక్తంచేశారు. గురువారం నాందేడ్ జిల్లా ధర్మాబాద్‌లోని పంచాయతీ కార్యాలయం ఎదుట 42 గ్రామాల సర్పంచులు బైఠాయించి నిరసన దీక్ష చేపట్టారు. హమారేకో తెలంగాణమే మిలాలో.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతుల…

Read More

మూడు విడ‌త‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల పోలింగ్ వివ‌రాలు ఇవే..!

హైదరాబాద్: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జనవరి 21న మొదటి విడత పోలింగ్.. రెండో విడత పోలింగ్ జనవరి 25న.. మూడో విడత పోలింగ్ జనవరి 30న నిర్వహిస్తామని కమిషనర్ తెలిపారు.  తొలి విడత ఎన్నికలు జనవరి 7న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు7 నుంచి 9 వరకు నామినేషన్ల స్వీకరణ10న నామినేషన్ల పరిశీలన11న ఆర్డీవోలకు అప్పీలు చేసేందుకు అవకాశం12న ఆర్డీవోలచే అప్పీల పరిష్కారం13న నామినేషన్ల ఉపసంహరణ21 పోలింగ్, ఓట్ల లెక్కింపు రెండో విడత ఎన్నికలు జనవరి 11న నోటీస్ ఇవ్వనున్న రిటర్నింగ్ అధికారులు11 నుంచి 13 వరకు…

Read More

The Karmanghat Hanuman Temple is one of the oldest and popular Hindu temples in Hyderabad

The Karmanghat Hanuman Temple is one of the oldest and popular Hindu temples in Hyderabad

శ్రీఆంజనేయస్వామి భక్తులపాలిట పెన్నిధి. నిత్యం రామ ధ్యానంలో వుండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత,ప్రేత,పిశాచ భయాలను పోగొడతాడు. ధ్యానముద్రలో స్వయంభువుగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి అవతరించిన క్షేత్రమే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ ఆలయం. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యానముద్రలో వున్న అంజనాసుతుని దర్శనాన్ని చేసుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేనివారు స్వామిని దర్శించి నిండుమనస్సుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని పెద్దలు చెబుతారు. రెండో ప్రతాపరుద్రునికి దర్శనం.. క్రీ.శ. 1148లో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించే రెండో ప్రతాపరుద్రుడు వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతనికి పులి గాండ్రింపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడకు…

Read More

న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు సమయాల్లో మార్పులు

న్యూఇయర్ సందర్భంగా మెట్రో రైలు సమయాల్లో మార్పులు

హైదరాబాద్: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా రేపు(డిసెంబర్ 31)న నగరంలోని మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. మియాపూర్, ఎల్బీనగర్, నాగోలు నుంచి అర్ధరాత్రి 12 గంటలకు చివరి మెట్రో బయలు దేరనుంది. అమీర్ పేట నుంచి అర్ధరాత్రి 12.30 కు చివరి మెట్రో రైలు బయలుదేరనున్నట్టు మెట్రో అధికారులు వెల్లడించారు.

Read More